బాలయ్య, బోయపాటి మూవీ అప్ డేట్స్

534
balakrsihna Boyapati
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఇటివలే రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుక వచ్చాడు. ఈ మూవీ కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక బాలయ్య తర్వాతి చిత్రం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రం జనవరి 3 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా మే నెలలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈమూవీలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.

ఇక బాలకృష్ణకు హీరోయిన్ గా కేథరిన్ ను తీసుకున్నట్లు సమాచారం. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుండటంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా దర్శకుడు బోయపాటి చివరగా రామ్ చరణ్ తో వినయ విధేయ రామ మూవీ చేశారు. ఈమూవీ ప్లాప్ కావడంతో బోయపాటికి పెద్దగా అవకాశాలు రాలేదు. మరి బాలయ్యతో బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

- Advertisement -