బాలయ్యకు విలన్‌గా తమిళ బ్యూటీ..

453
- Advertisement -

నట సింహ నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, వచ్చేనెల 7వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బాలకృష్ణ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ – వేదికలను కథానాయికలుగా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో నటి భూమిక ఓ కీలకమైన పాత్రలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

namitha

ఇక ఈ మూవీలో న‌మిత లేడీ విల‌న్‌గా అల‌రించ‌నుంద‌ని సమాచారం. సింహా త‌ర్వాత బాల‌య్య‌, న‌మిత క‌లిసి న‌టించిన మ‌రో చిత్రమిది. ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అదే టైటిల్ ను ఖాయం చేస్తారా? లేదంటే మరో టైటిల్ ఏదైనా నిర్ణయిస్తారా? అనేది చూడాలి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

- Advertisement -