జూలై రేసులో నిలిచిన నక్షత్రం…

220
Nakshatram Official Teaser
- Advertisement -

సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం నక్షత్రం. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన‌, ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌లేదు.ఇటీవలె సందీప్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది.టీజర్‌లో కృష్ణవంశీ క్రియేటివిటీ తళుక్కున మెరిసింది.

తాజాగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ అన్నీ  పూర్తైన  ఈ చిత్రాన్ని జులై 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో మూవీ బిజినెస్ కూడా స్పీడుగా జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తుండ‌గా, రేపు గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేయ‌నున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రాక్ లిస్ట్ విడుద‌ల చేశారు. న‌క్ష‌త్రం చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ క్రూషియ‌ల్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు.

- Advertisement -