వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర

505
nagoba jatara
- Advertisement -

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్‌ జిల్లాలోని నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులతోపాటు ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు, భక్తుజనంతో నాగోబా ఆలయం కిక్కిరిసిపోయింది. కెస్లాపూర్‌ నుంచి నాగోబా విగ్రహాన్ని తీసుకొస్తున్న మెస్రం వంశీయులను మర్రిచెట్లకు వెళ్లేదారిలో మర్రిచెట్ల వద్ద బసచేసిన మెస్రం వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు.

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత.

ఈ జాతరలో కీలకమైన ప్రజాదర్బార్‌ ఈనెల 27న జరుగనుండగా.. మంత్రులు, కలెక్టర్‌, వివిధశాఖల అధికారులు హాజరై గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపడం ఇక్కడి ప్రత్యేకత.

Image result for nagoba jatara

- Advertisement -