పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు..

353
nagi reddy
- Advertisement -

పారదర్శకంగా, శాంతియుతంగా మున్సిపల్ ఎన్నికలను జరిపేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి.మున్సిపల్ ఎన్నికల నిర్వహణ,ఓటర్ల జాబితా,వార్డుల పునర్విభజనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగిరెడ్డి ఎన్నికల నిర్వహణ కొంత లెట్ అయింది,కేసుల వలన ఎన్నికలు లెట్ అయ్యాయయని తెలిపారు.

ప్రభుత్వం ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కోరిందని దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 14 వ తేదీ తుది ఓటర్ల జాబితా ప్రకటన ఉంటుందని..చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నారు. జూలై 11న మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలన్నారు.

12 వ తేదీ మళ్ళీ శిక్షణ కార్యక్రమం ఉంటుందని…ఓటర్ల జాబితా ను అందరికి అందుబాటులో ఉంచాలన్నారు. 14 వ తేదీ నాడు తుది జాబితా విడుదల చేయాలన్నారు. 14వ తేదీ నాడే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు లిస్ట్ ఇవ్వాలన్నారు. 15 వ తేదీన పోలింగ్ కేంద్రాలపై అభిప్రాయాలను తీసుకోవాలి ఒక్కవేళ తప్పనిసరిగా మార్చాల్సి వస్తే మార్చాలని సూచించారు.

షెడ్యూల్ ప్రకారమే వార్డ్స్ పునర్విభజన చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి. చాలా తక్కువ సమయంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నందుకు కృతజ్ఞతలు…ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఓటర్ల జాబితా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన కార్యాలయాలలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -