స‌మంతకు ఛాలెంజ్ విసిరిన నాగార్జున‌..

314
nagarjuna greenchallenge
- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మానికి అద్భుతమైన స్పంద‌న వ‌స్తుంది. హ‌రిత‌హారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందిరాజ‌కీయ నేత‌లు, సెల‌బ్రెటీలు ఒక్కొక్క‌రు 3మొక్క‌లు మ‌రో ముగ్గురికి స‌వాలు విసురుతున్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీక క‌విత‌, క్రికెట‌ర్లు స‌చిన్, వివిఎస్ ల‌క్ష్మ‌ణ్, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇలా ప‌లువ‌రు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీక‌రించి ప‌లువురికి స‌వాల్ విసురుతున్నారు.

nagarjuna green challeange

ఈసంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ మూడు మొక్క‌లు నాటి సినీ హీరో, అన్న‌పూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగ‌ర్జున‌కు గ్రీన్ ఛాలెంజ్ స‌వాల్ విసిరిరారు. ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోలో త‌న సిబ్బందితో క‌లిసి మూడు మొక్క‌లు నాటారు నాగార్జున‌. అంతేకాకుండా మ‌రో ముగ్గురికి ఆయ‌న స‌వాల్ విసిరారు. బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహర్, నాగార్జున కోడ‌లు స‌మంత‌, త‌మిళ హీరో ధ‌నుష్ కు గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్న‌ట్లు నాగార్జున ట్వీట్ చేశారు.

- Advertisement -