ఆ విషయంలో హరీష్ రావే ఆదర్శం:ఎమ్మెల్యే రోజా

600
roja harishrao
- Advertisement -

ప్రజలకు మరింత చేరువకావడంలో తనకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావే ఆదర్శమన్నారు సినీనటి,నగరి ఎమ్మెల్యే రోజా. స్ధానికంగా వైసీపీ సమావేశంలో మాట్లాడిన రోజా.. ఎవరు ఫోన్ చేసినా,తనకు సమస్య ఉందని వస్తే చాలు దాని పరిష్కారం కోసం పాటుపడతారని కొనియాడారు. వచ్చిన మనిషిని గౌరవించడం,సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తారని దీని ద్వారా మంచి పేరు వస్తుందని రోజా తెలిపారు.

స్ధానికంగా ఉన్న వైసీపీ నేతలు సైతం ఇదే పద్దతిని ఫాలో అవ్వాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకుసాగాలన్నారు. ఎన్నికలయ్యేంత వరకే రాజకీయాలు అని ఇప్పుడు ఆలోచించాల్సింది నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే అన్నారు.

మై ఎమ్మెల్యే యాప్‌ ద్వారా ప్రజలు తనను సంప్రదించవచ్చని సూచించారు. సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన వారి సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఫాలో అప్ చేస్తానని తెలిపారు. ఫైనల్‌గా నగరిని అభివృద్ధి పథంలో నడిపించడమే తనముందు ఉన్న కర్తవ్యమన్నారు.

- Advertisement -