సాగర్ నుంచి మూడోరోజు నీటి విడుదల

167
Nagarjuna Sagar

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి వరుసగా మూడో రోజు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 6 లక్షల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 581 అడుగులకు చేరుకున్నది. డ్యామ్ ఫుల్ కెపాసిటీ 312 tmc లు ఉండగా ప్రస్తుతం 281 tmc ల నీరు డ్యామ్ లోకి వచ్చి చేరింది. సాగర్ అందాలను వీక్షించడానికి మూడో రోజు కూడా పర్యాటకులు పోటెత్తారు. సాగర్ పరిసరాలన్ని పర్యాటకులతో కిటికీటలాడుతున్నాయి.

ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకా భారీ వరదలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ఉదృతం గా ప్రవహిస్తుడటంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలను, నది సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పోలీసు, రెవెన్యూ అధికారాలు ఆయా గ్రామాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. మత్సకారులు చేపల వేటకు వెళ్లకుండా నిషేధం విధించారు.

సాగర్ నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ కు చేరుతుండటంతో పులిచింతల ప్రాజెక్ట్ 19 గేట్లను ఎత్తి ప్రకాశం బ్యారేజ్ కి నీటిని విడుదల చేస్తున్నారు.

కిష్ణమ్మ ఉదృతంగా ప్రవహిస్తుడటంతో నది వెంట ఉన్న సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కి వరద నీరు వచ్చి చేరింది. దీనితో గుడిని మూసి వేశారు అధికారులు. పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని కొన్ని ముంపు గ్రామాలను వరద చుట్టి ముట్టింది… ..అక్కడున్న ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించారు అధికారులు. సాగర్ లో పులిచింతల లాల్లో పూర్తి స్థాయి. విద్యుత్ ఉత్పత్తి ని చేపడుతున్నారు జెన్కో అధికారులు.