రోజాపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

442
Nagababu Roja

మెగా బ్రదర్ నాగబాబు జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జి తెలుగులో లోకల్ గ్యాంగ్స్ అనే షోకు ఆయన జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. కాగా జబర్ధస్త్ నుంచి బయటకు రావడానికి గత కారణాలను ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పారు. చాలా కష్ట కాలంలో జబర్ధస్త్ తనను ఆదుకుందని తెలిపారు. కొన్ని పర్సనల్ కారణల వల్ల జబర్ధస్త్ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. కాగా జబర్ధస్త్ షో ఇంత హిట్ కావడానికి మరో కారణం జడ్జ్ లు రోజా, నాగబాబు అని చెప్పుకోవాలి. అయితే నాగబాబు వెళ్లిపోయాక రోజా ఒంటరిగానే షో ను కంటిన్యూ చేస్తుంది.

తాజాగా నాగబాబు రిలీజ్ చేసిన వీడియోలో రోజాపై తన అభిప్రాయాన్నితెలియజేశారు. జబర్ధస్త్ కంటే ముందుగా నేను అదుర్స్ అనే ప్రొగ్రామ్ చేశాను. ఆ టైంలో నా మేనేజర్ వచ్చి జబర్ధస్త్ అనే ప్రొగ్రామ్ వస్తుంది..కేవలం ఒక 25 ఎపిసోడ్లు ప్లాన్ చేశారని దానికి జడ్జ్ గా ఉండాలని చెప్పారు. అంతేకాదు ఈ ప్రోగ్రామ్‌లో మీకు రాజకీయ విభేదాలున్న రోజాతో కలిసి పనిచేయాలని కూడా చెప్పారు. అది మీకిష్టమేనా అని అన్నారు. అప్పుడే ఆలోచించాను. ప్రత్యర్ధి పార్టీకి చెందిన వ్యక్తితో కలిసి    పనిచేయాలా ? వద్దా ? అని ఆలోచించాను. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా క్రియేటివ్ ఫీల్డ్‌లో అవన్ని చూపించకూడదని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా జబర్ధస్త్ కామెడీ షో లో రోజాతో మంచి అనుబంధం ఉందని అన్నారు. రాజకీయాల పరంగా వేరే పార్టీలో కొనసాగుతున్నా…సినిమా పరంగా మాత్రం తమ మధ్య ఎటువంటి  విబేధాలు లేవని చెప్పారు.