27న నాగ‌శౌర్య `అశ్వ‌థ్థామ‌` టీజ‌ర్‌

378
naga shourya
- Advertisement -

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. సినిమా హీరో నాగ‌శౌర్య‌నే ఈ సినిమాకు క‌థ‌ను అందించాడు. ఈ సినిమాను నాగ‌శౌర్య ఎంతో ప్రేమించి ప్యాష‌నేట్‌గా రూపొందిస్తున్నారు. అందుక‌నే ఈ సినిమా టైటిల్‌ను ఛాతీపై ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నారు కూడా.

ప్ర‌స్తుతం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా టీజ‌ర్‌ను డిసెంబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస‌ర్ట్స్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, నిన్నే నిన్నే అనే ఫ‌స్ట్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, మెహ‌రీన్ త‌దిత‌రులు,సాంకేతిక వ‌ర్గం:బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌,నిర్మాత‌: ఉషా ముల్పూరి,క‌థ‌: నాగ‌శౌర్య‌,ద‌ర్శ‌క‌త్వం: ర‌మ‌ణ‌తేజ‌,సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ రెడ్డి,సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌,ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్,లైన్ ప్రొడ్యూస‌ర్‌: బుజ్జి,డిజిట‌ల్‌: ఎంఎన్ఎస్ గౌత‌మ్‌,డైలాగ్స్‌: ప‌రుశురాం శ్రీనివాస్‌, యాక్ష‌న్‌: అన్బ‌రివు,కొరియోగ్రాఫ‌ర్‌: విశ్వ ర‌ఘు

- Advertisement -