గీత గోవిందం దర్శకుడితో నాగచైతన్య

434
nc20.jpeg
- Advertisement -

మజిలీ, వెంకీ మామ తో సూపర్ హిట్స్ సాధించిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య , గీత గోవిందం వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో చిత్రాన్ని గద్దలకొండ గణేష్ లాంటి మాస్ హిట్ అందించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.

నాగ చైతన్య 20 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు అతి త్వరలో తెలియజేయనున్నారు. దర్శకుడు పరశురామ్ చివరగా విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాతో బ్లాక్ బాస్టర్ సినిమాను అందుకున్నారు. మొదట మహేశ్ బాబు, అఖిల్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చిన ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. చివరగా నాగ చైతన్యతో సినిమాను ఫైనల్ చేశాడు.

- Advertisement -