నాగచైతన్య లవర్ గా రష్మీక మందన!

398
Naga Chaitanya Rashmika
- Advertisement -

రష్మీక మందన కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఛలో మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇటివలే మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కాగా రష్మీక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. దీంతో పాటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా రష్మీకను తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇదిలాఉండగా రష్మీక తాజాగా మరో మూవీని ఓకే చేసింది. అక్కినేని నాగచైతన్య దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో రష్మీకను హీరోయిన్ గా తీసుకున్నారట. ఈచిత్రానికి నాగేశ్వర్ రావు అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ మూవీలో నటిస్తున్నాడు. కాగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -