నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్‌..!

911
Naga Chaitanya
- Advertisement -

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లోతెరకెక్కుతున్న మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి ‘లవ్ స్టోరీ’అనే పేరును ఖరారు చేసారు శేఖర్ కమ్ముల. హీరో,హీరోయిన్స్ కలసి ఉన్న పోస్టర్‌కి చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది. ఒక ఇంటెన్సిటీ ఉన్న పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రేమలో కనిపించే బావోద్వేగాలను పోస్టర్‌లో పలికించాడు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్‌ని పోస్టర్‌తో కలిగించారు శేఖర్ కమ్ముల.పోస్టర్‌తో కథను పరిచయం చేయడంలో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది.

నాగచైతన్య , సాయి పల్లవి, శేఖర్ కమ్ముల క్రేజీ కాంబోకి తగ్గ లుక్ కి విడుదల చేసింది యూనిట్. రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న ‘పవన్ ’అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది. ఈ చిత్రానికి సంబందించిన లాస్ట్ షెడ్యూల్ పండుగ తర్వాత ప్రారంభం అవుతుంది. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్‌ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటుంది.

Love Story

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్‌కి స్సెషల్ ఎట్రాక్షన్‌గా మారబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ట్:రాజీవ్ నాయర్ సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్, సహా నిర్మాత : విజయ్ భాస్కర్, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా, డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల, మ్యూజిక్ : పవన్, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు, రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల.

- Advertisement -