పవన్‌ సినిమాపై నాగబాబు క్లారిటీ..

285
naga-babu
- Advertisement -

ఎన్నికల్లో జనసేన పార్టీకి తీవ్ర నిరాశాజనక ఫలితాలు లభించడంతో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, మెగాబ్రదర్ నాగబాబు అవన్నీ వట్టి ఊహాగానాలే అని స్పష్టం చేశారు. వీడియో లైవ్ స్ట్రీమింగ్ లో అభిమానులతో ముచ్చటించిన నాగబాబు, తనకు తెలిసి కల్యాణ్ బాబు ఓసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోడని చెప్పారు.

Naga Babu

“కల్యాణ్ బాబు ఓ సారి తాను సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత మళ్లీ అందులోకి రారు. మా అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నాడు కాబట్టే మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కల్యాణ్ బాబు అలా కాదు, సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్లారు.

ఓవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు” అంటూ వివరించారు. అయితే, ఇందులో ఓ మినహాయింపునిచ్చారు. భవిష్యత్తులో ఎవరైనా అతిథి పాత్ర చేయమంటే చేసే అవకాశాలున్నాయని అన్నారు. హీరోగా మాత్రం తన సోదరుడి కెరీర్ ముగిసినట్టేనని చెప్పకనే చెప్పారు.

- Advertisement -