డిస్కో రాజాతో ఛాందీని సెల్ఫీ..

601
nabha-natesh
- Advertisement -

మాస్ మహారాజా ప్రస్తుతం డిస్కో రాజా మూవీలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వీఐ ఆనంద్ ఈసినిమాకు దర్శకత్వం వహించగా రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాలో రవితేజ సరసన ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, ఇస్మార్ట్ శంకర్ హీరోయన్ నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆగిపోయిన ఈసినిమా షూటింగ్ ఇటివలే తిరిగి ప్రారంభమైంది.

కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ లో పాల్గోంది పాయల్ రాజ్ పుత్. తాజాగా నభా నటేశ్ కూడా షూటింగ్ జాయిన అయ్యింది. ఈసందర్భంగా రవితేజతో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నభా నటేశ్. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈమూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫ్రీ అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -