వాలంటైన్స్ డేకి బన్నీ సాంగ్‌‌..

235
- Advertisement -

వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’ . అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల వదిలిన ఈ సినిమా ఫస్టు ఇంపాక్ట్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. నా పేరు సూర్య అంటూ అల్లు అర్జున్ చేస్తున్న హంగామా అదిరిపోతోంది. ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ న్యూ ఇయర్ రోజున ఇచ్చిన టీజర్ తోనే.. సినిమాలో కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో.. ఏ యాంగిల్ లో ఉంటుందో చెప్పేశాడు బన్నీ.

Naa Peru Surya second song on Valentine's Day

ఆ తర్వాత రిపబ్లిక్ డే రోజున విడుదల చేసిన సైనిక సాంగ్ తో.. నా పేరు సూర్య ఇలా ఉండబోతోందంటూ అభిమానుల్లోను ఆడియన్స్ లోను ఓ నిర్ణయం ఏర్పడిపోయింది. దేశభక్తి నేపథ్యమే ఈ చిత్రంలో కీలకం అనే సంగతి ఫిక్స్ అయిపోయారు. ప్రమోషనల్ కంటెంట్ ను చూసి ఇప్పటివరకు ఇది సీరియస్ సినిమా అందరికీ ఫీలింగ్ ఏర్పడిపోయింది. ఇది కొన్ని వర్గాల ఆడియన్స్ ను దూరం చేస్తుందనే ఆలోచన కలిగిందట మేకర్స్ కి. అందుకే ఇప్పుడు ప్రచారపర్వంలో మరో స్టెప్ ముందుకు వేస్తున్నారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంగా.. ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేయనున్నారట.

ఈ సినిమాలో ఉన్న రొమాన్స్ చూపిస్తారట మూవీ యూనిట్. అల్లు అర్జున్- అను ఇమాన్యుయేల్ లపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది అని తెలుస్తోంది. అందుకే వేలంటైన్స్ డేను ఎంచుకున్నారట. అలా లవర్స్ తో పాటు కుర్రాళ్లను సూర్యకు కనెక్ట్ చేయబోతున్నారట. ఒక్కో ప్రమోషనల్ మెటీరియల్ ను.. ఒకో సెగ్మెంట్ ను టార్గెట్ చేసేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. నా పేరు సూర్య రిలీజ్ డేట్ వచ్చేనాటికి.. ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ బయటకు వస్తుందట. అదీ బన్నీ అండ్ వక్కంతం వంశీ ప్లాన్.

- Advertisement -