‘నా పేరు రాజా’ షూటింగ్ పూర్తి..

404
Naa Peru Raja
- Advertisement -

అమోఘ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా “తిరుగుబోతు ” చిత్రం ద్వారా టాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన యాక్షన్ స్టార్ రాజ్ సూర్యన్ హీరోగా ఈ సారీ మూడు డైనమిక్ మరియు డిఫరెంట్ పాత్రలు, గెటప్‌లతో వస్తోన్న చిత్రం ` నా పేరు రాజా`. `ఈడో రకం… డెఫినెట్లీ డిఫరెంట్` అనేది టాగ్ లైన్. ఇక ఇందులో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఆకర్షిక మరియు హాట్ మోడల్ నస్రీన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ చిత్రం ద్వారా ప్రభు సూర్య, ఆయుశ్రీ, ఇరాన్ సూపర్ మోడల్ అవ సఫాయి, ఆరాధ్య నటీ నటులుగా పరిచయమవుతున్నారు.

Naa Peru Raja

ఈ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…“ ఆంధ్ర-తెలంగాణ, కేరళ, కర్ణాటకలో దాదాపు 65 రోజులలో షూటింగ్ పూర్తి చేసాము. ఇక ఇందులో సెన్సేషనల్ టైటిల్ సాంగ్ “రాజా రాజా మన్మధ రాజా ..ఆజా ఆజా నా రాజా “ సాంగ్‌ను కొరియోగ్రాఫర్ నగేష్ హాలీవుడ్ స్టైల్‌లో చిత్రీకరించారు. సాహితీ రాసిన ఈ పాటను మోహనా భోగరాజు పాడారు. కంటెంట్ నచ్చి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాం. ఇక అక్టోబర్‌లో ఆడియో రిలీజ్ చేసి సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

ప్ర‌భు సూర్య‌, ఆయుశ్రీ, ఇరాన్ , సూప‌ర్ మోడ‌ల్ అవా స‌ఫాయి, ఆరాధ్య త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతంః ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫ‌ర్ః ఎ.వెంక‌ట్; ఎడిట‌ర్ః వెంకీ యుడివి; ఫైట్స్ః థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మద‌; కొరియోగ్రాఫ‌ర్ః న‌గేష్‌.వి; లిరిక్స్ః శ్రీమ‌ణి, సాహితి; నిర్మాత‌లుః రాజ్ సూరియ‌న్‌, కిర‌ణ్ రెడ్డి, ప్ర‌భాకర్ రెడ్డి; ర‌చ‌న‌-ద‌ర్శ‌కత్వంః అశ్విన్ కృష్ణ‌.

- Advertisement -