మంత్రి జగదీష్ రెడ్డి శ్రమకు దక్కిన ఫలితం..

321

ఏళ్ల నాటి పాపం మూసి ఆయకట్టు రైతాంగానికి శాపంగా మారుతోందే మోనన్న సందేహం పటాపంచాలయింది. సీమాంద్రల ఎలుబడిలో తెలంగాణ పాలకుల కళ్ళు గప్పి 1991 ప్రాంతంలో తరలి పోయిన స్టాఫ్ లాగ్ గేట్లను వెనక్కి తెప్పించారు.ఒక్కో నీటి బొట్టును మూసికి చేర్చేందుకు మంత్రి జగదీష్ రెడ్డి పడిన శ్రమ కాంక్రీట్‌లోపంతో గేట్ పక్కకు తొలగడంతో ఆయకట్టు రైతాంగంలో ఆందోళన మొదలైంది. ప్రతి ఇంచు భూమికి నీళ్లు ఇవ్వాలన్న తలంపుతో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డికి తలవని తలంపుగా గేట్ పక్కకు తొలగడం ఒకింత ఇబ్బందిగా పరిణమించింది.

అయినా అననుకూల పరిస్థితులను అధిగమించడం వెన్నెతో పెట్టిన విద్యగా పుణికి పుచ్చుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ఆఘమేఘాల మీద మూసి డ్యామ్‌కు చేరుకున్నారు .అప్పటికప్పుడే నీటిపారుదల అధికారులను డ్యామ్ మీదకు రప్పించారు.ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.అక్కడి నుండే పరిస్థితి తీవ్రతను అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ చెవున పడేశారు.

jagdish-reddy

ఇంకేముంది మూసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకునేందుకు కంకణ బద్ధులైన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావులతో పాటు నీటి పారుదల నిపుణులను క్షణాలమీద ప్రత్యేక హెలికాప్టర్‌లో మూసి డ్యామ్ మీదకు పంపించారు.వచ్చిన అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షించారు.కల్యాణి డ్యామ్ వద్ద ఉన్న రెండు గేట్లను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు.నీటి ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన మరో 8 ఎలిమెంట్స్ ను హైదరాబాద్ లోని మియాపూర్ వద్ద ఉన్న వర్క్‌షాప్‌లో తయారు చెయ్యాలని ఆదేశించారు.

అనుకుందే తడవుగా చిత్తూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో తరలి పోయిన స్టాఫ్ లాగ్ గేట్లను వెనక్కి రప్పించారు.నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్ నరసింహా అక్కడే ఉండి అన్ని తానై వర్క్ షాప్‌లో దగ్గర ఉండి 8 ఎలిమెంట్స్ ను యుద్ద ప్రాతిపదికన తయారు చేపించారు. మొదటి ఎలిమెంట్స్ ను శనివారం రాత్రి తొలగిన గేట్‌కు అడ్డంగా అమర్చిన అధికారుల బృందం మరో రెండు ఎలిమెంట్స్ ను ఆదివారం మధ్యాహ్ననీకి అమర్చారు.

kcr-cm

మొత్తము నాలుగు ఎలిమెంట్స్ ను అమర్చి గేట్‌ను యదస్థానంలో అమర్చడంతో మూసి నుండి బయటకు తరలి పోతున్న నీటి ప్రవాహం పూర్తిగా ఆగి పోయింది .మరో నాలుగు ఎలిమెంట్స్ ను ఆదివారం రాత్రి వరకు దింపేందుకు అధికారులు సన్నద్ధమౌతున్నారు.కళ్లెదుటే యుద్ద ప్రాతిపదికన జరుగుతున్న చర్యలు చూసి ఆయకట్టు రైతాంగాం అచ్చెరువు వొందుతున్నారు.ఇందులో ఎదో రాజకీయం చేయాలనుకున్న పగటి వేశగాళ్ల నోళ్ళకు మంత్రి జగదీష్ రెడ్డి చూపిన సమయస్ఫూర్తి తాళాలు పడేలా చేసింది.

మూసిలో పూర్తి స్థాయి నీటిమట్టాన్ని పెంచుతాం…

ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం మూసి డ్యామ్‌ను సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మూసిలో పూర్తి స్థాయి నీటి మట్టాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.5వ గేట్ స్థాన చలనంతో కొంత ఇబ్బంది జరిగిందన్నారు.మూసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని ఆయన చెప్పారు.