జబర్ధస్ద్ కమెడీయన్ పై హత్యాయత్నం

142
Murder Attempt on Jabardasth Vinod

జబర్ధస్ద్ లో లేడి గెటప్ లో కనిపించే వినోదిని అలియాజ్ వినోద్ పై హత్యాయత్నం జరిగింది. కాచిగూడలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వినోద్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు.   జులై 19వ తేదీ శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉన్న సమయంలోనే  ఆయనపై ఒకేసారి ముగ్గురు వ్యక్తులు హ్యతాచారానికి పాల్పడ్డారని తెలిపారు.

దీంతో ఘటన జరిగిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు వినోదిని. తన ఇంటి ఓనరే తనపై హత్యకు ప్రయత్నించాడని వినోద్ పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనలో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది. వినోద్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడ్డ వారి పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని వినోద్ కు భరోసానిచ్చారు.

జబర్ధస్ద్ కామెడీ షో లో గత కొద్ది రోజులుగా లేడి గెటప్ లతో అలరిస్తున్నాడు వినోద్. లేడి గెటప్స్ వినోద్ కు మంచి పాపులారిటీ తీసుకువచ్చాయి. ఆయన కాచిగూడలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. గతంలో కూడా వినోద్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.