కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు.. త్వరలోనే బీజేపీలోకి ?కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

264
Koamtireddy Rajagopal Reddy Bjp

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయం బీజేపీ మాత్రమేనని చెప్పారు.

రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అన్యాయం జరిగింది అన్నారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీని చేజేతులా నాశనం చేసుకున్నామని తెలిపారు.

తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర నాయకత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.