ప్లే ఆఫ్స్‌లో రోహిత్ సేన…

349
mumbai vs srh
- Advertisement -

ఐపీఎల్‌ 12లో భాగంగా వాంఖడేలో ముంబై మెరిసింది. సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ 8 పరుగులే చేయగా ముంబై 9 రన్స్‌ చేసి గెలిచింది.

ముంబై విధించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్‌ కు వృద్ధిమాన్‌ సాహా (25), గప్టిల్‌ (15) మంచి శుభారంభాన్నిచ్చారు. అయితే, ఓపెనర్లు ఇద్దరినీ బుమ్రా (2/31) అవుట్‌ చేసి సన్‌రైజర్స్‌కు షాకిచ్చాడు. మనీష్‌ పాండే (47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో పోరాడడంతో.. సన్‌రైజర్స్‌ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్ల నష్టానికి 162 పరుగులతో స్కోరు సమం చేసింది.

అంతకముందు టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(69) ,రోహిత్‌శర్మ(24), సూర్యకుమార్‌ యాదవ్‌(23) ,హార్దిక్‌ పాండ్య(18) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు చేసింది.

బౌలింగ్‌లో రాణించిన బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ దక్కింది. ఈ విజయంతో రోహిత్‌ సేన మొత్తం 16 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకగా.. హైదరాబాద్‌ ప్లే ఆఫ్ ఆశలు చివరి మ్యాచ్‌లో విజయంతోపాటు మిగతా జట్ల గెలుపు ఓటములపై ఆధారపడి ఉంది.

- Advertisement -