జార్ఖండ్‌ సీఎంగా ధోని..బీజేపీ బంపర్ ఆఫర్

463
Dhoni As Jharkhand Cm
- Advertisement -

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధోని ఏం చేస్తాడన్న దానిపై ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ధోని త్వరలోనే బీజేపీలో చేరనున్నాడని తెలుస్తుంది. ఇందుకోసం బీజేపీ పెద్దలతో ఆయనతో ఇప్పటికి సంప్రదింపులు జరిపినట్లుగా సమచారం.

ఇక మరోవైపు మరి కొద్ది రోజుల్లోనే జార్జండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈఎన్నికల్లో ధోనిని తమ ప్రధాన అస్త్రంగా భావిస్తోంది బీజేపీ. జార్ఖండ్ లో ధోనికి ఉన్న ఫాలోయింగ్ తో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ధోనిని బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపి సీఎం అభ్యర్ధిగా ప్రకటించనున్నారని తెలుస్తుంది.

ఇక ఇదే అంశంపై మాజీ కేంద్రమంత్రి సంజయ్ పాస్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.ఇంత వరకు టీమిండియాకు ఆడిన ధోనీ… ఇకపై టీమ్ నరేంద్ర మోదీ తరపున సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతాడని చెప్పారు.

- Advertisement -