మిస్టర్ కూల్ ధోనిపై జరిమానా..

270
Dhoni
- Advertisement -

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి మిస్టర్ కూల్ గా పేరుంది. ఎంతటి టఫ్ సిచుయేషన్ లో అయిన కూల్ గా ఆడటం ఆయనకు అలవాటు. కానీ నిన్న రాజస్ధాన్ వర్సెస్ చెన్నైతో జరిగిన మ్యాచ్ లో థోని చెలరేగిపోయాడు. నిన్నటి మ్యాచ్ లో చెన్నై 3బంతుల్లో 8పరుగులు చేయాలి. బ్యాట్స్ మెన్ సాంట్నర్ 2పరుగులు చేశాడు…దీంతో మొదట ఆ బంతిని నో బాల్ గా ప్రకటించాడు మెయిన్ ఎంపర్..ఆ తర్వాత లెగ్ ఎంఫైర్ కాదనడంతో మెదట ఎంఫైర్ తో వాగ్వాదానికి దిగాడు బడేజా.

అప్పటికి అంపైర్లు అదే మాట మీద ఉండడంతో కెప్టెన్‌ ధోని మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. అయినా అది నో బాల్ కాదంటూ స్పష్టం చేశారు ఎంపైర్లు. ధోని ఎంపైర్లతో వాగ్వాదానికి దిగడంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2వ స్థాయి నేరంగా పరిగణిస్తూ, మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాను విధించారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ధోనీ మ్యాచ్‌ ఫీజులో సగం కోత విధించారు. అది నోబాలా కాదా అనే విషయం పక్కనపెడితే.. డగౌట్‌లో ఉన్న ధోనీ.. నేరుగా గ్రౌండ్‌లోకి వచ్చి అంపేర్ల నిర్ణయాన్ని ప్రశ్నించడం వివాదాస్పమైంది. దీనిపై ధోని ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

- Advertisement -