ధోని హోటల్‌..ఎంతైన తినండి..నో బిల్…!

459
dhoni hotel
- Advertisement -

సినీ,రాజకీయాలు,క్రీడా ఇలా ఏ రంగమైన తాము అభిమానించే వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధమైన ఫ్యాన్స్‌ ఉంటారు. కొంతమంది అకేషన్‌ను బట్టి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది తమ అభిమాన హీరో,హీరోయిన్స్‌ కోసం గుడికడితే ఓ క్రికెట్ అభిమాని ఏకంగా హోటలే పెట్టేశాడు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా…ఆగండి..ఎందుకంటే..ఈ హోటల్‌లో ఎంత తిన్న ఫ్రీ.

శంభూ బోస్‌కు చిన్నప్పటి నుండి ధోని అంటే అభిమానం ఎక్కువ. అందుకే ఓ హోటల్ స్ధాపించి అందులో అందరికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు. పశ్చిమబెంగాల్‌లోని అలిపర్దువార్‌ జిల్లాలోని ఈ హోటల్ చాలా ఫేమస్‌. ఎంఎస్‌ ధోని పేరుతో నడుస్తున్న ఈ హోటల్‌లో ఎవరు వచ్చి భోజనం చేసినా డబ్బులు తీసుకోరు. ఎంతైనా తినొచ్చు..ఎన్నిసార్లైనా టీ-కాఫీలు తాగొచ్చు.

ధోని ఆటతీరు కన్నా అతని వ్యక్తిత్వం అంటే ఎంతో ఇష్టమని ప్రపంచకప్‌లో ధోని చివరలో సిక్స్‌ కొట్టడం చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయన్నాడు. ధోనిని ఎప్పటికైనా కలవాలన్నదే తన కోరిక అని..ఒకవేళ ధోనీని కలిస్తే నా హోటల్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తానని చెబుతున్నాడు. మొత్తంగా తాను అభిమానించే వ్యక్తి కోసం ఇలా సేవ చేస్తుండటం అందరి చేత శభాష్ అనిపిస్తోంది.

- Advertisement -