200 సిక్స‌ర్లు కొట్టిన ఏకైక భార‌త‌ క్రికెట‌ర్‌ ఇతనే..

25
MS Dhoni

ఆదివారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య హోరా హోరి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ధోనీ 24 పరుగులు బాది ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. తోటి బ్యాట్స్‌మెన్‌ బంతిని ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతుంటే ధోనీ మాత్రం అలవోకగా బౌండరీలు బాది తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు (84) నమోదు చేశాడు. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం సాధించింది.

MS Dhoni

అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 200 సిక్స‌ర్లు బాదిన ఏకైక భార‌త‌ క్రికెట‌ర్‌గా ధోనీ నిలిచాడు. టీ20 కెరీర్‌లోనే అత్య‌ధిక స్కోరు న‌మోదు చేసిన ధోనీ 84(48 బంతుల్లో) ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 184 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4330 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 84 కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ధోనీ ఖాతాలో 292 ఫోర్లు.. 203 సిక్స‌ర్లు ఉన్నాయి.