మాగ్నిజెంట్ కంపెనీని ప్రారంభించిన ఎంపీ సంతోష్

268
Mp Santhosh Kumar

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి మాగ్నిజెంట్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ ప్రారంభించార రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. కంపని లాంచింగ్ లో భాగంగా గ్రీన్ ల్యాండ్స్ లో అఫీస్ ముందు ఉద్యోగుల తో కలిసి సంతోష్ కుమార్ చేతుల మీదిగా మొక్కను నాటారు కంపెనీ CEO కిషన్ కవికొండల , గర్రెపల్లి సతీష్,వడుపు శ్రీనివాస్ గారు. అనంతరం గ్రీన్ పార్క్ హోటల్ కి విచ్చేసిన యంపి సంతోష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి MDS కంపెనీ లాంచ్ చేశారు.

ఈసందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్ మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి కంపెనీలు స్ధాపించి కొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయం అన్నారు. ఈసందర్భంగా ఎమ్ డీఎస్ టీమ్ అందరికి శుభాకాంక్షాలు తెలిపారు. ఈ కంపెనీ విజయవంతంగా నడవాలని కొరుకుంటున్నట్లు తెలిపారు.

Green

CEO కిషన్ కవికొండల మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణ ఉద్యమం నుంచి ఈసీఎం కేసీఆర్ వెంట ఉంటూ ఈ రోజు బంగారు తెలంగాణ దిశగా తన వంతు పాత్ర వహిస్తున్నారని అన్నారు. నిరంతరం కష్టపడుతూ అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ కలుపుకెళ్లే సంతోష్ కుమార్ లాంటి యంగ్ లీడర్ MDS లాంచ్ కి రావడం గొప్ప విషయం అన్నారు. US లో అలాగే ఇండియాలో ఇంజనీరింగ్ & మ్యానిఫేక్చరింగ్ రంగంలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నాము అని అన్నారు. అదే విధంగా మరిన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ కొద్ది రోజుల్లోనే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని అన్నారు.

mp

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉద్యమంలా సాగుతుందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.పర్యావరణన్ని రక్షించుకోవల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.