సంతన్న గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన జడ్పీటీసీ

296

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు అద్భుత స్పందన వస్తోంది. సినీ,రాజకీయాలకు అతీతంగా మొక్కలు నాటుతూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరికొంతమందికి గ్రీన్ ఛాలెంజ్‌ని విసురుతున్నారు.

తాజాగా ఎంపీ సంతోష్ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరించారు జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య,వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య. సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నిలోజిపల్లి గ్రామములో వీరి ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటారు. ఈ మొక్కలకు ట్రీ గార్డ్స్ సమకూర్చారు అనుముల భాస్కర్ .

ట్విట్టర్ వేదికగా వీరిపై ప్రశంసించారు ఎంపీ సంతోష్. మండలంలోని ప్రజాప్రతినిధులు అంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటిన జడ్పీటీసీ,వైస్ ఎంపీ,ట్రీ గార్డ్స్ పంపిణీ చేసిన భాస్కర్ ను అభినందించారు.

mp santhosh