తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదలచేయండి: నామా

457
mp nama
- Advertisement -

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరామని తెలిపారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అనంతరం మాట్లాడిన ఆయన కొత్త రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను కేంద్రమంత్రికి అందజేశామన్నారు.

ఐజిఎస్టీ నిధులు 4, 531 కోట్లు,విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు 450 కోట్లు,రెండో దఫా లోకల్ బాడీ లకు రావాల్సిన 312 కోట్లు,యుఎల్సీబి నుండి రావాల్సిన 393 కోట్లు,నీతి ఆయోగ్ సూచించినట్లుగా మిషన్ భగీరథ కు 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు 5వేల కోట్లు విడుదల చేయాలని కోరామన్నారు.

నిధుల ఆలస్య ప్రభావం రాష్ట్ర అభివృద్ధి పనులపై పడుతోందని…దేశ ఆర్థికమాంద్య ప్రభావం రాష్ట్రలపై పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇతర ఎంపీలు రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నిధుల విడుదలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తాం అన్నారు. రెండు మూడు రోజుల్లో చెప్పిన అంశాలను పరిశీలిస్తామని సీతారామన్ హామీ ఇచ్చారని వెల్లడించారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలపై ఉభయ సభలను స్తంభింప చేశామన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. కొత్త రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారని….రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి బిజెపి ఎంపీలు ఏనాడు మాట్లాడలేదన్నారు. టిఆర్ఎస్ ఎంపీలు అడిగితే.. తప్పుడు లెక్కలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

mp nama nageshwarrao meets union minister Nirmala Sitaraman. mp nama nageshwarrao meets union minister Nirmala Sitaraman.

- Advertisement -