దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళుః లోక్ సభలో ఎంపీ నామా

315
Nama Nageshwar Rao
- Advertisement -

తెలంగాణ  డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు. రైతులకు పంట సాయం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై లోక్ సభలో ఇవాళ మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం కేవలం 1 లక్ష 20 వేల రూపాయలు మాత్రమే మంజూరు చేస్తోందన్నారు.

కేంద్రం ఇచ్చే డబ్బులతో ఒక గదిని మాత్రమే నిర్మించగలుగుతామని…ఒకటే గదిలో నలుగురు కుటుంబ సభ్యులు ఎలా నివాసం ఉండగలుగుతారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని గుర్తు చేశారు.ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెచ్చిస్తూ కుటుంబమంతా సౌకర్వవంతంగా నివాసం ఉండేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్రం రైతులకు కేవలం 6 వేల రూపాయల నగదును బదిలీ చేస్తున్నారని..ఈ నగదును 3 విడతల్లో చెల్లించడం సరికాదని తెలిపారు.తెలంగాణలో రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు కేవలం రెండు విడుతల్లోనే చెల్లిస్తున్నామని చెప్పారు.

- Advertisement -