ప్రధాని మోదీతో ఎంపీ కవిత భేటీ

177
mp-kavitha-meets-prime-minister-narendra-modi
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీని నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కలిశారు. పసుపు రైతుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం మద్ధతు తెలిపిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేఖలు సైతం కవిత అందజేశారు.

ప‌ది నెలల పాటు సాగు చేసే పసుపు పంటలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని మోడీకి వివరించారు క‌విత‌. విత్తనాల దగ్గర నుంచి దిగుబడి, మద్ధతు ధర వరకు వారికి ఏ సహాయం లేదని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే తప్ప ప్రీ-హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ సహాయం అందేలా లేదని స్పష్టం చేశారు. దేశంలో 13 రాష్ట్రాల్లో పసుపు సాగవుతున్నందని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందన్నారు. సాగు, ప్రాసెసింగ్, మద్ధతు ధర విషయాల్లో పసుపు బోర్డు ఉంటే రైతులకు మేలు జరుగుతుందన్నారు ఎంపీ కవిత. పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదని కవిత ప్ర‌ధాని మోడీని కోరారు.

- Advertisement -