దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందిః ఎంపీ కే. కేశవరావు

64
shila_dixit kk

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ఇవాళ మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమె ఇవాళ మధ్యాహ్నం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. షీలా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

షీలా దీక్షిత్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు రాజ్యసభ సభ్యులు కే కేశవరావు. అభివృద్దిలో ఆమె ముఖ చిత్రం ఎప్పటికి నిలిచి ఉంటుందన్నారు. పార్టీలు ఏవైనా ఆమె చేసిన అభివృద్దిని కాదనలేరన్నారు. దేశం నేడు ఓ గొప్ప వ్యక్తి ని కోల్పోయిందని..కాంగ్రెస్ పార్టీకి ఆమె మరణం తీరని లోటన్నారు. షీలా దీక్షిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.