రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలి: ఎంపీ బడుగుల

420
badugulalingaiah
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి 13వ ఆర్థిక సంఘము ద్వారా కేటాయించిన రూ. 2027 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఈ రోజు రాజ్యసభ లో జీరో అవర్ లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు. గతంలో హైకోర్ట్ స్టే కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని కారణంతో 13 వ ఆర్థిక సంఘము ద్వారా మంజూరైన 2027 కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్రానికి నిలిపివేసారని , కాని 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి అయిన కూడా నేటికి రావాల్సిన నిధులు మంజూరు చేయక జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీజీ కళలుకన్న గ్రామ స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో 30 రోజుల సమగ్ర గ్రామ ప్రణాళిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులను గ్రామాల్లో పర్యటింపజేసీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేలా చేశారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన సుమారు రూ. 350 కోట్ల నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంజూరుచేసి గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

14వ ఆర్ధిక సంఘం ద్వారా మంజురై పెండింగ్ లొ ఉన్న నిధులను కూడ వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇందులో భాగంగా తెలంగాణ లోని ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు రావల్సిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు బీఆర్జీఎఫ్ స్కీం ద్వారా 2013, 2014 సంవత్సరాలకు సంధించిన నిధులు కూడా వెంటనే మంజూరు చేయాలని కోరారు.

- Advertisement -