కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ బిబి పాటిల్..

519
MP B B Patil
- Advertisement -

ఎంపీ బిబి పాటిల్ జహీరాబాద్ నియోజక వర్గంలో రోడ్ల విస్తరణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భరత్ మాల పరియోజన కింద నేషనల్ హైవేస్ ఆథారిటి ఆఫ్ ఇండియా(NHAI) బోధన్ – రుడ్రూర్ – మడ్నూర్ నాలుగు లైన్ల రహదారి అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చించారు.

అనంతరం ఎంపీ బిబి పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. భోదన్ – మడ్నూర్ జాతీయ రహదారికి సంగారెడ్డి – నాందేడ్ – అకోలా, NH 63 బాంబే – నిజామాబాద్‌కు రహదారి లింక్ మిసైంది. హైవే 1, హైవే 2, మీడియం, ప్రియారిటీ రోడ్లను NHAI కింద అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రిని కోరామని ఆయన అన్నారు. 33 కిలో మీటర్ల పోడవైన భోధన్ – మడ్నూర్ జాతీయ రహదారి కి సంబంధించిన డిపిఅర్ ఇంకా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించాము.

మా విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. జహీరాబాద్ అలాగే రాష్ట్రానికి సంబంధించిన మరిన్ని అంశాలపై మరింత మంది కేంద్ర మంత్రులను కలవనున్నాం. సోయాబిన్ సమస్యపై త్వరలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ థోమర్‌ను కలువనున్నామని అని పాటిల్‌ తెలిపారు.

- Advertisement -