నైరుతి రాక ఆలస్యమే..కానీ!

451
imd predicts
- Advertisement -

నైరుతి రుతుపవనాల రాక ఈ ఏడాది కాస్త ఆలస్యం కానుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా మన దేశంలోకి ప్రతీ ఏడాది జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, జూలై రెండో వారం వరకు దేశమంతా వ్యాపిస్తాయి. కానీ ఈసారి జూన్ 1 నాటికే రుతుపవనాలు వచ్చినా పది సబ్‌ డివిజన్లలో (ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌, విదర్భ, మధ్య మహారాష్ట్ర, కొంకన్‌, గోవా, గుజరాత్‌లోని కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాలు) నైరుతి రుతుపవనాలు విస్తరించే తేదీల ప్రకటనలో మాత్రమే మార్పు ఉంటుందని ఐఎండీ తెలిపింది.

విత్తనాలు నాటుకునే రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వర్షాకాలం సాధారణం గా జూన్‌ – సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకుతాయని వెల్లడించింది.

వాయవ్య భారతావని (రాజస్థాన్‌) నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లే అంచనా తేదీల్లోనూ మార్పు ( సెప్టెంబర్‌ 1కు బదులుగా సెప్టెంబర్‌ 10) ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.

- Advertisement -