రివ్యూ : మామ్

302
MOM Review
- Advertisement -

ద‌క్షిణాదినే కాదు, ఉత్త‌రాది చ‌ల‌న చిత్ర రంగంలో కూడా సూప‌ర్‌స్టార్ స్టేట‌స్‌తో రాణించిన తొలి హీరోయిన్ శ్రీదేవి‌. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి చాలా కాలం తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ అంటూ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మంచి కథ కోసం ఎదురుచూసిన శ్రీదేవి తాజాగా మామ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  యుక్త‌వ‌య‌సులోని ఓ కూతురికి, అమ్మ‌కు మ‌ధ్య ఎలాంటి సంఘ‌ర్ష‌ణ ఉంటుందనే విషయాన్ని చ‌క్క‌గా చూపించారు. మరి అమ్మ పాత్రలో శ్రీదేవి ఎలా ఒదిగిపోయింది..? మామ్‌గా మెప్పించిందా లేదా చూద్దాం…

కథ :

దేవకి (శ్రీదేవి) టీచర్‌గా పనిచేస్తుంటుంది. భర్త ఆనంద్‌ (అద్నాన్‌ సిద్దిఖీ). వీరిద్దరిది అన్యొన్య కాపురం. వీళ్లకి ఇద్దరు పిల్లలు ఆర్య, ప్రియ. అయితే… ఆర్య మాత్రం దేవకిని ‘మామ్‌’ అని పిలవదు. అమ్మగా చూడదు. ఎందుకంటే.. దేవకి సవతి తల్లి. తన తల్లి స్థానంలో దేవకిని ఉహించుకోలేకపోతుంది ఆర్య. ఓరోజు ప్రేమికుల రోజున.. తన స్నేహితులతో కలసి పార్టీకి వెళ్తుంది ఆర్య. అక్కడ నలుగురి చేతుల్లో  అత్యాచారానికి గురవుతుంది. ఆ నలుగురూ పోలీసులకు దొరికేస్తారు. కానీ.. సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల నిర్దోషులుగా విడుదల అవుతారు. వాళ్లపై దేవకి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నది అనేదే ‘మామ్‌’ కథ.

MOM Review
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ శ్రీదేవి, నవాజుద్దీన్‌ సిద్దీకీ, నేపథ్య సంగీతం, భావోద్వేగాలు. దేవకి పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయింది. కూతురి కోసం ఆరాటపడే తల్లిగా అద్బుతనటనతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా కూతురుకి అన్యాయం జరిగినప్పుడు శ్రీదేవి ఏడ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌లో భావోద్వేగాలు శ్రీదేవి తప్ప ఎవరు చేయలేరనిపిస్తుంది. అద్‌నాన్ సిద్ధిఖీ త‌న పాత్రకు న్యాయం చేశౄడు. యుక్త‌వ‌య‌సురాలైన అమ్మాయి పాత్ర‌లో స‌జ‌ల్ అలీ చ‌క్క‌గా న‌టించింది. న‌వాజుద్దీన్ సిద్ధిఖీ స‌హా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ ప్రతీకార సన్నివేశాలు.  సినిమా మొత్తంగా చూస్తే క‌థ‌లో ట్విస్టులు, ట‌ర్నింగ్ పాయింట్‌లు ఏమీ క‌న‌ప‌డ‌వు. సినిమా స్టార్ట‌యిన ఇర‌వై నిమిషాల‌కు క‌థేంటో మ‌న‌కు తెలిసిపోతుంది. సెకండాఫ్ ఇంకాస్త ఆసక్తికరంగా మార్చుంటే బాగుండేది. సెకండాఫ్ కాస్తా లెంగ్తీగా అనిపించింది. సినిమా స్లోగా న‌డుస్తుంది. సినిమాలో ఎమోష‌న్స్ త‌ప్ప చెప్పుకోతగ్గ బ‌ల‌మైన అంశం క‌న‌ప‌డదు.

MOM Review
సాంకేతిక విభాగం:

టెక్నికల్‌గా సినిమాకు మంచి మార్కులే పడతాయి. మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్‌ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. దర్శకుడి పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. గోస్వామి సినిమాటోగ్ర‌ఫీ సింప్లీ సూప‌ర్బ్‌. పాట‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం క‌న‌ప‌డ‌దు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువల బాగున్నాయి.

తీర్పు:

ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ తో తెరపై రీ ఎంట్రీ ఇచ్చిన  శ్రీదేవి చాలా కాలం తర్వాత మంచి కథ కోసం చాలా కాలం ఎదురుచూసి నటించిన సినిమా  మామ్. శ్రీదేవి నటన,భవోద్వేగాలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా రోటిన్ స్టోరీ, సెకండాఫ్ సినిమాకు మైనస్ పాయింట్స్ . మొత్తంగా శ్రీదేవి మామ్‌గా తన నటనతో మెప్పించిందనే చెప్పాలి.

MOM Review
విడుదల తేదీ: 07/07/2017
రేటింగ్ :  2.5/5
న‌టీన‌టులుః శ్రీదేవి, అద్‌నాన్ సిద్ధిఖీ
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
నిర్మాత‌లుః బోనీ క‌పూర్‌, సునీల్ మాన్‌చంద్ర‌, న‌రేష్ అగ‌ర్వాల్‌, గౌత‌మ్ జైన్‌, ముకేష్‌
ద‌ర్శ‌కత్వం: ర‌వి ఉద్య‌వ‌ర్‌

- Advertisement -