హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ గెలుపు..

531
- Advertisement -

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. 146 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు.హెచ్‌సీఏ ఎన్నికల్లో మొత్తం 227 ఓట్లకు గానూ.. 223 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవి కోసం అజహరుద్దీన్‌తో పాటు దిలీప్‌ కుమార్‌, ప్రకాష్‌ చంద్‌ జైన్‌లు పోటీ పడ్డారు. అజహర్‌కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్‌ జైన్‌ 73, దిలీప్‌ కుమార్‌ 3 ఓట్లు వేశారు. అయితే హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్‌కు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ అజహర్‌ విజయం సాధించారు.

Mohammad Azharuddi

 

రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసినా అది తిరస్కరణకు గురైయింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్‌ నామినేషన్‌ను ఆమోదించలేదు. ఈ సారి మాత్రం వివేక్‌ నామినేషన్ ను తిరస్కరించి హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి రెండోసారి పోటీపడ్డ అజహర్‌ విజయం సాధించారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో అజారుద్దీన్ వర్గం సంబురాలు చేసుకుంది. 56ఏండ్ల అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

- Advertisement -