రాహుల్‌కి మోడీ విషెస్…

332
rahul modi
- Advertisement -

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పుట్టిర రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మోడీ రాహుల్‌కు దీర్ఘాయువు, ఆరోగ్యకరమైన జీవితం కోసం తాను ప్రార్థిస్తున్నాని…. ఆయన సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

మరోవైపు న్యూఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాస ప్రాంతం కాంగ్రెస్ కార్యకర్తల సందడితో నిండిపోయింది. తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. రాహుల్‌ పుట్టిన రోజు సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ ప్రజస్వామ్యం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలనే సందేశాన్ని ప్రచారం చేయడం కోసం ‘రన్‌ ఫర్‌ రాహుల్ గాంధీ’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

 Rahul Gandhi

130 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన ఆరో వ్యక్తిగా రాహుల్‌ నిలిచారు. 1998 నుంచి 19 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన సోనియా గాంధీ..తన వారసుడిగా రాహుల్‌ను ప్రకటించి తప్పుకుంది.

19 జూన్ 1970న రాహుల్ ఢిల్లిలో జన్మించారు.కేంబ్రిడ్జ్ లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేశారు రాహుల్. ఆ తరువాత లండన్ లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్‌ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గంలో నిలబడి ఎంపిగా గెలిచారు. 2007లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

- Advertisement -