వారణాసిలో మోడీ..వాయనాడ్‌లో రాహుల్‌

253
modi rahul
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశగా దూసుకుపోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారణాసి నుండి విజయబావుటా ఎగురవేయగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌ నుండి భారీ మెజార్టీతో గెలుపుపొందారు.

రెండోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న మోడీ త‌న స‌త్తా చాటారు. పోలైన ఓట్ల‌లో 63 శాతం ఓట్లు మోడీ ఖాతాలోనే ప‌డ్డాయి. మోదీపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి అజ‌య్ రాయ్‌కు కేవ‌లం 53 వేల ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. మోదీ క‌న్నా సుమారు రెండు ల‌క్ష‌ల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఓట‌మి పాల‌య్యారు.

రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. భారీ మెజార్టీతో రాహుల్ గెలుపొందారు. రాహుల్ పోటీచేసిన మరో స్ధానం అమెథీలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ..రాహుల్‌పై ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -