పేదల సంక్షేమం కోసమే గురుకులాలు:పట్నం

115
mlc patnam

పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించిందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు లో బాలికల బీసీ గురుకుల పాఠశాల ప్రారంభించిన ఆయన పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం 119 బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటుచేశామన్నారు.

వికారాబాద్ జిల్లా లో నాలుగు బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశామని చెప్పారు.సీఎం కేసీఆర్ బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గురుకులాల ఏర్పాటు చేశారని వెల్లడించిన ఆయన విద్యా వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన మహేందర్ రెడ్డి తాండూరు లాంటి వెనుక బడిన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.

అనంతరం తాండూరు గొల్ల చెరువు ఆధునీకరణ పనులను పరిశీలించారు.చెరువు తూములు, కట్ట పనులతో పాటు బతుకమ్మ ఘాట్ ను త్వరగా పూర్తి చేయాలన్నారు.వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.