నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

761
MLA Thatikonda Rajaiah
- Advertisement -

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆయా గ్రామాలలో జాతీయ జెండా ఎగురవేసి నిరాడంబరంగ జరుపుకోవాలని కోరుతున్నాను అని ఎమ్మెల్యే అన్నారు.

వ్యవసాయం దండగ కాదు పండగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు అనడమే కాదు చేసి చూపిస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే ప్రతి ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది అన్నారు. రైతులు మొక్కజొన్న స్థానంలో పత్తి, మిరప, 40 శాతం సన్న రకం ధాన్యం, 60 శాతం దొడ్డు రకం ధాన్యం పంటలను వేయాలని నిర్ణయించడం జరిగింది.

ఇక గండి రామారం పైప్ లైన్ నుండి మల్లికుదుర్ల, షోడశ పల్లి, గుండ్ల సాగరం చెరువులను నింపడానికి ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కాలువ పనులకు సోమవారం జరిగే ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వస్తున్నారు అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -