వర్మ ఆఫర్ కు రోజా సిగ్నలిచ్చేసింది..

219
- Advertisement -

సినిమాలతోనే గాక, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ.. తన దర్శకత్వంలో రాబోతోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో రోజాకు అవకాశం ఇస్తానని వర్మ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా ఆఫర్‌పై నగరి ఎమ్మెల్యే రోజా రియాక్ట్ అయ్యారు. వర్మ ఆఫర్‌పై సానుకూలంగా స్పందించిన రోజా..లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మంచి రోల్ ఇస్తే నటిస్తానని చెప్పారు.  వర్మ ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో తనకు తెలియదని, వర్మ సంప్రదించాక అన్ని వివరాలూ వెల్లడిస్తానన్నారు.
 MLA Roja Reaction on varma offer...
రోజా ఇటీవలి కాలంలో సినిమాల్లో నటించడం లేదు. దీనికి తోడు రాజకీయంగానూ ఆమె బాగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆఫర్‌పై సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా..ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తొలుత ప్రకటించిన వర్మ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను సినిమాగా తీస్తానని ప్రకటించారు. సినిమాకు వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని పలమనేరులో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటికి దర్శకుడు రాంగోపాల్‌వర్మ వెళ్లారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ..ఈ సినిమాలో పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరనీ నిర్ణయించలేదని, ఈ చిత్రంలో ఎమ్మెల్యే రోజాకు అవకాశం ఉంటుందని వర్మ అన్నారు. ఎన్టీ రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయడం సంతోషమన్నారు. కాగా, ఎన్టీఆర్ సినిమాకు ఎంత ఖర్చయినా భరిస్తానని నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. మొత్తానికి ఈ సినిమాలో రోజాను వర్మ ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్‌ చెయ్యాల్సిందే.

- Advertisement -