ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా ఎమ్మెల్యే రోజా…

91
MLA Roja

నగరి ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి. మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన నగరి ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఆమెకు కీలకమైన పదవిని అప్పగించారు. ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య) ఛైర్ పర్సన్ గా రోజాను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

MLA Roja

తాజాగా ఏర్పాటు చేసిన కేబినేట్‌లో రోజాకు ఎలాంటి మంత్రి ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చైర్‌పర్సన్‌గా ఆమె నియామకం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియదని ఇటీవల రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏ పదవి ఇచ్చినా తగిన న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లలో కీలకమైన ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి ఆమెను వరించింది. దీంతో, ఆమెకు ఊరట లభించినట్టైంది.