బతుకమ్మ చీరల తయారీపై కేటీఆర్ సమీక్ష..

337
- Advertisement -

మరమగ్గాల కార్మికులను పారిశ్రామిక వేత్తలు (వర్కర్ టు ఎంటర్ ప్రెన్యూర్ లు) మార్చే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన గ్రూప్ వర్క్ షెడ్ పథకంలో సిరిసిల్లను దేశానికే తలమానికంగా నిలపాలని నియోజకవర్గం శాసన సభ్యులు ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్కర్ టు ఎంటర్ ప్రెన్యూర్, అపెరెల్ పార్క్ పనులు పురోగతి, బతుకమ్మ చీరల తయారీ, టెక్స్టైల్ పార్క్ అదనపు పనుల ప్రగతిపై చేనేత,జౌళి శాఖ అధికారులతో శాసన సభ్యులు ఎమ్మెల్యే కేటీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు.

చేనేత,జౌళి శాఖ సంచాలకురాలు శైలజా రామయ్యర్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రగతిని ఎమ్మెల్యే కేటీఆర్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. వర్కర్ టు ఎంటర్ ప్రెన్యూర్ స్కీం ప్రయోజనాలు కార్మికులకే దక్కేలా చూడాలని అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సుమారు 6 వేలకు పైన మరమగ్గాల కార్మికులు ఉండగా తొలి విడతలో 1104 మంది లబ్దిదారులకు ఈ స్కీంలో భాగంగా పెద్దూర్‌లోని 88 ఎకరాల స్థలంలో స్థలం,షేడ్‌తో పాటు 4 అధునాతన మరమగ్గాలు మంజూరు చేయాల్సి ఉన్నందున ఎంపిక పూర్తీ పారదర్శకంగా ఉండాలన్నారు.

ktr

ప్రత్యేక టీంలను ఏర్పరిచి లబ్దిదారుల ఎంపిక చేయాలన్నారు. కేటాయించిన మరమగ్గాలు ఇతరులకు లబ్దిదారులు అమ్మే వీలు లేకుండా నిబంధనలు విధించాలన్నారు. అలాగే TSSIC ఈ పరిశ్రమలకు పవన,సౌర ఆధారిత విద్యుత్‌ను సమకూర్చాలన్నారు. తద్వారా పర్యావరణ అనుకూల పార్క్‌గా తీర్చిదిద్దుకోవాలన్నారు కేటీఆర్‌. ఈ స్కీం క్రింద ఏర్పాటు చేసే షెడ్ లు ఆధునికంగా ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉండాలన్నారు. గ్రూపు షెడ్ ల నిర్మాణం,పూర్తీ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను దశల వారిగా మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అన్నీ పనులు పూర్తీ చేయాలని కేటీఆర్ ఆదేశించారు. షెడ్ లను మహిళల పేరు మీద కేటాయించేలా చూడాలన్నారు. 50 షెడ్ లలో ప్రత్యేకంగా మహిళల కోసం కొన్ని షెడ్ లను కేటాయించి, వస్త్ర పరిశ్రమలో మహిళల బాగస్వామ్యం పెంచి వారి సాధికారిత కోసం కృషి చేయాలన్నారు.

గ్రూప్ వర్క్ షెడ్ పథకం లబ్దిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత వారికి అధునాతన మరమగ్గాలు పనితీరుపై ఒరియంటేషన్ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రూప్ వర్క్ షెడ్ వద్ద కార్మికులకు మౌలిక వసతులు రెస్ట్ రూమ్‌లు, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా మినీ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు వీలుగా ప్రతిపాదనలు పంపాలన్నారు,షెడ్ లలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు.

రెండో దశ గ్రూప్ వర్క్ షెడ్ పథకం (వర్కర్ టు ఎంటర్ ప్రెన్యూర్ లు) కోసం రెవిన్యూ అధికారులు సిరిసిల్ల శివారులో 300 ఎకరాలను వారం రోజుల్లోగా గుర్తించాలన్నారు. గుర్తింపులో ప్రభుత్వ భూమికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే పెద్దూర్ గ్రూప్ వర్క్ షెడ్ పథకం కోసం గుర్తించిన స్థలంలో చిన్న చిన్న భూ సేకరణ సమస్యలు ఉన్నాయని ప్రత్యేక దృష్టి సారించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. సిరిసిల్ల వస్త్ర ఉత్త్పత్తిలో మధ్య దళారుల ప్రమేయం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము ఉత్పత్తి చేసిన వస్త్రంను నేతన్నలే నేరుగా విక్రయించుకునే సౌలభ్యం కల్పించాలన్నారు. దేశంలో ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చిన ఇక్కడ పరిశ్రమలలో తయారు చేసేలా చూడాలని కేటీఆర్‌ తెలిపారు.

ktr

అనంతరం టెక్స్టైల్ పార్క్ లో మౌలిక సదుపాయాలలో భాగంగా రూ .10 కోట్ల 67 లక్షలతో చేపడుతున్న 4 వరుస రహదారుల నిర్మాణం పుట్ పాత్ ల నిర్మాణం , కార్మికుల కోసం నిర్మిస్తున్న క్యాంటీన్, ప్రజా మరుగుదొడ్లు, పరిపాలన భవనం నిర్మాణాల ప్రగతిని శాసన సభ్యులు ఎమ్మెల్యే కేటీఆర్ సమీక్షించారు. వీటిలో చాలా వరకు పనులు పూర్తయ్యాయని అధికారులు ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలిపారు.

ప్రస్తుతం 1174 మంది మహిళలు జుకీ కుట్టు మిషన్ శిక్షణ పొందుతున్నారని తెలిపారు. మిగిలిన పనులను వెంటనే పూర్తీ చేసి సెప్టెంబర్ మొదటి వారం కల్లా ప్రారంభానికి సిద్ధం చేయాలనీ కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆర్డర్‌ల సమగ్ర వివరాలను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించే సమావేశంలో తనకు తెలియజేయలన్నారు. అనంతరం శాసన సభ్యులు ఎమ్మెల్యే కేటీఆర్ అపెరల్ పార్క్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

ఇక నుంచి జిల్లా లలో నిర్వహించే అధికారిక సమీక్ష సమావేశాలలో త్రాగునీటి ప్లాస్టిక్ బాటిల్ ల్లను వాడొద్దని శాసన సభ్యులు కేటీఆర్ అధికారులకు సూచించారు. ఆదిశగా జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు సర్కులర్ జారీ చేయాలనీ సూచించారు. అంతకుముందు సమావేశ గదికి వచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్ అధికారుల టేబుల్‌ల్లపై ప్లాస్టిక్ బాటిల్‌లను గమనించి వాటిని తీసి వేయించారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, చేనేత,జౌళి శాఖ సంచాలకురాలు శైలజా రామయ్యర్, TSIIC మేనేజింగ్ డైరెక్టర్ నరసింహా రెడ్డి , జేసి యాస్మిన్ భాషా, చేనేత,జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్, RDO టి శ్రీనివాస్ రావు, చేనేత,జౌళి శాఖ సంయుక్త సంచాలకులు వెంకటేశం, ఉప సంచాలకులు రతన్ కుమార్, టెక్స్ జనరల్ మేనేజర్ యాదగిరి, జిల్లా చేనేత,జౌళి శాఖ సహాయ సంచాలకులు అశోక్, IL&FS అధికారులు, ఇంజనీర్‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -