కేంద్ర మంత్రిని కలిసిన రామగుండం ఎమ్మెల్యే..

202
Korukanti-Chandar

కేంద్ర మంత్రి సదానంద గౌడ, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ గురువిన్ సిద్దుని నేడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిశారు.రామగుండంలో నిర్మిస్తున్న RFCL ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు పెద్దపీట వేయాలని ఆయన కోరారు. అలాగే RFCLలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనుమతులను రద్దు చేయాలని కోరిన ఎమ్మెల్యే, స్థానిక నాయకులు RFCLలో అన్యాయం జరుగుతోంది. స్థానికంగా RFCL నిర్మిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, స్థానికులు RFCL నిర్మాణం కోసం స్వచ్చందంగా ముందుకొచ్చి తమ భూములను ఇచ్చారు. కానీ, ప్రస్తుతం బయటి వారికి అవకాశం కల్పించడం వల్ల స్థానికులు నష్టపోతారు.

MLA Korukanti Chander

గతంలో కేంద్రియ విద్యాలయం, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో స్థానిక పేద ప్రజలు విద్యనభ్యసించి ఉన్నత స్థాయిలకు ఎదిగారు.అయితే, ప్రస్తుతం శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు అనుమతులు ఇవ్వడం వల్ల విద్య కాస్లీ అయ్యే ప్రమాదం ఉంది.ఈ స్కూల్ ప్రభావం సైతం స్థానిక పేద ప్రజలపై విపరీతంగా పడే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రి, ఉన్నతాధికారులకు వివరించాము. అభ్యర్థనలపై కేంద్ర మంత్రి, ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.