సఖి.. మహిళలకు రక్షణ కవచంలా ఉంటుంది- హరీష్

75
MLA Harish Rao

ఈ రోజు సిద్దిపేట జిల్లాలో సఖి కేంద్రం, బాల్ రక్ష భవన్‌ను ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మహిళలు ఎక్కువగా ఇబ్బందులకు గురైతున్నారు. సమాజం సఖి సెంటర్‌కు రాకూడదని కోరుకోవాలి అన్నారు.ఢిల్లీలో నిర్భయ సంఘటన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సఖి సెంటర్‌లు ఏర్పాటు
చేయడమైనది.

మహిళలకు వారి హక్కులు తెలిసేలా మహిళ సంఘాలు ,స్వచ్ఛంద సంస్థ లు కృషి చేయాలని హరీష్‌ రావు కోరారు. సఖి సెంటర్ ఒక ధైర్యాన్ని ఇస్తూ రక్షణ కవచంలా ఉంటుంది. ఈ సంస్థ ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడితేనే దానికి సార్థకత ఉంటుంది.సఖి సెంటర్‌లో ఉండే ఉద్యోగి తల్లిలాగా పని చేయాలి. అప్పుడే పుట్టిన పాపా నుండి18 ఏళ్ల అనాధ బాలబాలికలకు, లైంగికంగా వేదించబడినవారిని బాల రక్ష భవన్ హక్కునా చేర్చుకుంటుంది.

ఈ రెండు సంస్థలకు టోల్‌ ఫ్రీ నెంబర్‌లు కూడా ఏర్పాటు చేయడమైనది. సఖి సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్‌ 181,08457-229108,బాల రక్ష భవన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 లను వినియోగించుకోవాలని అన్నారు. సఖి సెంటర్‌పై మహిళలు విస్రృత ప్రచారం చేయండి. త్వరలోనే 50 లక్షలతో సఖి శాశ్వత భవనం సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఒంటరి మహిళకు మహిళ ప్రాంగణం మరియు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు కోసం అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆదేశించారు.