సీఎం కేసీఆర్ చింతమడక పర్యటనకు ఏర్పాట్లు..

108

సిద్దిపేట జిల్లా చింతమడకలో సీఎం కేసీఆర్ త్వరలో పర్యటించనునన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే హరీశ్‌ రావు పరిశీలించారు. ఆయన తోపాట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్,జేసీ పద్మాకర్ ఉన్నారు. ముఖ్యమంత్రి తన సొంత గ్రామానికి వెళ్తున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇక కేసీఆర్ చింతమడకలో ఆయన ఒక రోజంతా గడపనున్నారు.

Harish Rao

గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకోనున్నారు.స్ధానిక ఐకేపీ గోదాం సీసీ ప్లాట్‌ఫామ్ వద్ద సీఎం సభ నిర్వహించాలని, దాదాపు 3,200 మంది గ్రామస్థులకు, 200 మంది అధికారులకు కుర్చీలు ఏర్పాటుచేయాలని, మరో 200 కుర్చీలతో ప్రెస్‌గ్యాలరీ ఏర్పాటుచేయాలని హరీష్ రావు సూచించారు. అలాగే స్థానిక పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో వనభోజనాల ఏర్పాట్లను హరీశ్ రావు పరిశీలించారు.