మీ ఆరోగ్యమే నా ఆనందంః హరీష్ రావు

385
Harish Rao Speech
- Advertisement -

సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. తన దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ లో 12 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి..లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు ఎమ్మెల్యే హరీష్‌ రావు. ఈసందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దేశ వ్యాప్తంగా 23వేల మంది ప్రజా ప్రతినిధులు వచ్చి చూసివెళ్లారన్నారు. ఇక్కడ జరగుతున్న అభివృద్దిని గురించి అడగి తెలుసుకున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ జరగుతున్న అభివృద్ది, స్వచ్ఛ కార్యక్రమాలను చూసి నేర్చుకొని వెలుతున్నారని తెలిపారు. దొమలు, ఈగలను ఉరిపోలిమెరకు కూడా రాకుండా చేసిన గ్రామం ఇబ్రహీంపూర్ అన్నారు. ఈ వర్షాకాలంలో గ్రామానికి సంబంధించిన ఒక్క వ్యక్తికి కూడా జ్వరం రాలేదని చెప్పారు.

యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి పొలాలకు సాగు నీరందిస్తామని హామి ఇచ్చారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక అరగంట సేపు యోగా చేయాలి..అందుకు సంబంధించిన యోగ టీచర్ ను నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటే తాను ఆనందంగా ఉంటానని చెప్పారు.

- Advertisement -