ప్రజలు గుంపులుగా ఉండొద్దు- ఎమ్మెల్యే చిరుమర్తి

353
MLA Chirumarthi Lingaiah
- Advertisement -

నల్లగొండ జిల్లా చిట్యాల మునిసిపల్ పట్టణ కేంద్రంలో కరోనా వైరస్‌పై లాక్ డౌన్ ఉద్దేశించి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్ తీసుకునే సమయంలో ప్రభుత్వం మరియు అధికారులు సూచించినట్టు జాగ్రత్తలు పాటించాలి.

గ్రామాలలో సర్పంచులు,వార్డ్ నెంబర్లు,స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రేషన్ షాపుల వద్ద ప్రజలు గుంపులుగా వెళ్లకుండా వారికి అవగాహన కల్పించాలి. నిమ్మ రైతులు రేపటి నుండి వారి వారి వాహనాలలో గతంలో ఏ విధంగానైతే ఏజెన్సీలో అమ్మోవారో అక్కడికే తీసుకొస్తే కొనుగోలు చేసే విధంగా అధికారులు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

రైతులు ధాన్యం పూర్తిగా ఎండబెట్టిన తర్వాతనే మార్కెట్లోకి తీసుకురావాలని అలా తీసుకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తోంది. అలా కాదని గతంలో చేసిన విధంగా ఐకేపీ సెంటర్లలో మార్కెట్లలో ధాన్యాన్ని ఎండబెట్టి కార్యక్రమాలు చేసుకోవద్దు అని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -