బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి

609
Balka Foundation
- Advertisement -

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం మరియు నోట్ బుక్ ల పంపిణిని ప్రారంభించారు. చెన్నూర్ నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలు మరియు మోడల్ స్కూల్ లో చదివే డే స్కాలర్ విధ్యార్థులకు కడుపు నింపాలనే యం.ఎల్.ఎ బాల్క సుమన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా గురువారం పలువురు నాయకులు విధ్యార్థులకు మధ్యాహ్న భోజనాని కోసం చెక్ లని మరియు నోట్ బుక్ లని అందించారు. బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది నిరంతరం కొనసాగుతుందని తెలియ జేసారు.

balka Foundation2

విద్యార్థులు ఆకలితో అలమటించ కుండా సంతృప్తిగా తిని చదువుకోవాలని సీఎం కేసీఆర్ ఆశయమని దానిని ముందుకు తీసుకు పోవటంలో భాగంగా చెన్నూర్ నియోజక వర్గం లోని విద్యార్థులకు బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం మరియు నోట్ బుక్ లు అందించేల యం.ఎల్.ఎ బాల్క సుమన్ గారు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.చెన్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,చెన్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మందమర్రి జూనియర్ కళాశాల & కోటపల్లి మోడల్ స్కూల్ మరియు మందమర్రి మోడల్ స్కూల్ లోని డే స్కాలర్ విధ్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం చెన్నూర్ డిగ్రీ కళాశాల కి 50,000 మరియు జైపూర్ జూనియర్ కళాశాలకు 50,000 &
మందమర్రి జూనియర్ కళాశాలకి 50,000 మరియు మందమర్రి మోడల్ స్కూల్ కి 50,000 మరియు కోటపల్లి మోడల్ స్కూల్ కి 50,000 వేల చొప్పున మూడు లక్షల(3,00,000) విలువైన చెక్కులని ఆయా కలాశాల ల ప్రిన్సిపల్ లకి అంద జేశారు. యం.ఎల్.ఎ బాల్క సుమన్ గారి బాల్క ఫౌండేషన్ ఆద్వర్యంలో నోటు పుస్తతకాలు సైతం పంపిణి చేసారు.

Balka Foundation3

చెన్నూర్ నియోజక వర్గంలోని 32 ప్రభుత్వ పాఠశాలలోని హై స్కూల్ విధ్యార్థుల కోసం మరియు నియోజక వర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ల విధ్యార్థులకు,డిగ్రీ కళాశాల ల విధ్యార్థులు 8,000 ల మంది విధ్యార్థులకు 40,000 ల నోట్ బుక్ లు బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకి అందజేసారు.
ప్రతి ఒక్క విధ్యార్థి చదువుకుని ఉన్నత లక్ష్యాన్ని సాదించాలనేది యం.ఎల్.ఎ బాల్క సుమన్ గారి సమున్నత లక్ష్యం అని అందులో భాగంగానే కడుపు నిండ తిండి పెట్టి నోట్ పుస్తకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నం అని చెన్నూర్ యం.ఎల్.ఎ బాల్క సుమన్ గారు వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో జడ్.పి.టి.సి లు,యం.పి.పి లు,వైస్ యం.పి.పి లు మరియు యం.పి.టి.సి లు సర్పంచ్ లు చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మరియు స్థానిక తెరాస నాయకులు,కార్యకర్తలు,ప్రిన్సిపల్ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -