రాహుల్ రామకృష్ణపై సంచలన కామెంట్స్ చేసిన దర్శకుడు

107
Rahul Ramakrishna Director Prashanth Kumar

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచమయ్యాడు రాహుల్ రామకృష్ణ. సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించి … తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ ఆర్టీస్ట్ గా మారాడు. గతేడాది రాహుల్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ‘మిఠాయి’ అనే డార్క్ కామెడీ సినిమాలో నటించారు. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులను మెప్పించనప్పటికి సినిమా మాత్రం ప్లాప్ గా మిగిలిపోయింది. తాజాగా నటుడు రాహుల్ రామకృష్ణపై సంచలన కామెంట్స్ చేశారు దర్శకుడు ప్రశాంత్ కుమార్. ఈ పోస్ట్ కి ‘రాహుల్ రామకృష్ణతో చేదు మిఠాయి’ అనే టైటిల్ కూడా పెట్టాడు. మిఠాయి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు.

ఈసందర్భంగా నటుడు రాహుల్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడు. మిఠాయి సినిమా ప్లాప్ కావడానికి ముఖ్య కారణం రాహుల్ అని చెప్పారు. సినిమా షూటింగ్ లో రాహుల్ వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. ఈసినిమాకు రాహుల్ తనకు సరిగ్గా డేట్స్ ఇవ్వకుండా చాలా సన్నివేశాల్లో హడావుడిగా నటించాడని తెలిపారు. రాహుల్ తన ఫ్రెండ్ అయినప్పటికి అతని వల్ల నరకం అనుభవించానని తెలిపారు. ఆర్థికంగా కూడా తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పారు.

పదిరోజులు షూటింగ్ లో తన ఖర్చులను 70 వేల రూపాయల బిల్ ఇచ్చాడని.. అందరూ ప్రొడక్షన్ ఫుడ్ తింటే రాహుల్ మాత్రం అలా చేసేవాడు కాదని వాపోయాడు. రాహుల్ నోరి విప్పితే అబద్ధమని, ఆయనకి అదొక రోగమని అన్నారు. మన ముందు ఒకలా వెనక ఇంకేలా మాట్లాడే నేర్పరి అని ఆరోపించారు.ఈ క్రమంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్‌ గురించి తన వద్ద రాహుల్ చెప్పిన విషయాలను ప్రశాంత్ ప్రస్తావించారు. భరత్ అనే నేను’ సినిమాలో రాహుల్ నటన చూసి భయపడిన మహేష్ బాబు తన పోర్షన్ ఎడిట్ చేయించాడని రాహుల్ చెప్పుకొని తిరుగుతుంటాడని సంచలన కామెంట్స్ చేశారు.